పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ..BRO టీజర్ రాబోతుంది

పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ..BRO టీజర్ రాబోతుంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో.. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej) కాంబోలో వస్తున్న మూవీ 'BRO'..తాజాగా ఈ మూవీ టీజర్ అప్డేట్ వచ్చేసింది. జూన్ 29వ తేదీ సాయంత్రం 5.04 గంటలకు టీజర్ రిలీజ్ చేస్తామని ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ అప్డేట్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయినా పోస్టర్స్ తెగ ట్రెండింగ్ లో ఉన్నాయి. 

పవన్  తీవ్ర జ్వరంతో ఉండగానే తన పాత్రకు డబ్బింగ్ జనసేన  పార్టీ కార్యలయంలోనే  చెప్పాడని సమాచారం. ఇది పవన్ కళ్యాణ్ డెడికేషన్ అంటూ ఫ్యాన్స్ నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. 

తమిళ మూవీ వినోదయ సీతంకు రీమేక్‌గా సముద్రఖని(Samuthirakani) బ్రో మూవీని తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్(Trivikram) మాటలు అందిస్తుండగా..పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory)  బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక బ్రో మూవీను జులై 28న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు