ఏపీలో బ్రూక్ఫీల్డ్ పెట్టుబడి రూ. 10 వేల కోట్లు

ఏపీలో బ్రూక్ఫీల్డ్ పెట్టుబడి రూ. 10 వేల కోట్లు

హైదరాబాద్​, వెలుగు: బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పునరుత్పాదక ఇంధన రంగంలో రాబోయే మూడేళ్లలో దాదాపు రూ.10 వేల కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది.  దీంట్లో ఇండోసోల్ తయారీ, నవయుగ పునరుత్పాదక పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోలియో, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఉన్నాయి. 

అంతేకాక,   విశాఖపట్నంలో కొత్త టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ అభివృద్ధి చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా తమ లీలా హోటల్స్ పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోలియోను విస్తరించాలని యోచిస్తోంది. 2030 నాటికి తమ భారతదేశ పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోలియోను 100 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంలో ఈ పెట్టుబడి కీలక భాగమని ప్రకటించింది.