ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చక్కెర స్థాయిలు ఎక్కువగా, సోడియం స్థాయిలు తక్కువగా ఉండడంతో గురువారం ఆయన సికింద్రాబాద్​లోని యశోద ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు ఆయన్ను అబ్జర్వేషన్​లో పెట్టిన డాక్టర్లు.. పలు టెస్టులు చేశారు. శనివారం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో డిశ్చార్జి చేశారు. వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించారు. 

గురువారం, శుక్రవారం రెండు రోజులు మరికొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుందని, మరోసారి ఆస్పత్రికి రావాలని సూచించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం కేసీఆర్ నందినగర్​లోని తన నివాసానికి చేరుకున్నారు. కాగా, శనివారం ఉదయం ఎమ్మెల్సీ కవిత.. కేసీఆర్​ను ఆసుపత్రిలో పరామర్శించారు. పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నందినగర్​లోని ఇంటికి వెళ్లి కేసీఆర్​ను పరామర్శించారు.