కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్​ కౌన్సిలర్లు

కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్​ కౌన్సిలర్లు

జమ్మికుంట, వెలుగు : జమ్మికుంట మున్సిపాలిటీలో అవిశ్వాసం వీగి వారం కాకముందే మూకుమ్మడిగా 13 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రిజైన్​ చేసిన కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు అవినీతి పాలన, నిధుల దుర్వినియోగం, ఒంటెత్తు పోకడలకు విసుగు చెంది నెల క్రితం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామన్నారు.

క్యాంపుకు వెళ్తే చైర్మన్ తో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చొరబడి భయపెట్టి కౌన్సిలర్లను ఎత్తుకెళ్లారని, ఆ కారణంతో అవిశ్వాసం వీగిపోయిందన్నారు. దీంతో మూకుమ్మడిగా కౌన్సిలర్లంతా కాంగ్రెస్​లో చేరాలని నిర్ణయించుకున్నామన్నారు. కాంగ్రెస్ నేత ఒడితల ప్రణవ్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో గాంధీభవన్​లో కాంగ్రెస్ లో చేరినట్టు చెప్పారు.

కాంగ్రెస్​లో చేరిన వారిలో బొంగోని వీరన్న, మారేపల్లి బిక్షపతి ,మేడిపల్లి రవీందర్, ఎలగందుల స్వరూప, పిట్టల శ్వేత, పొన్నగంటి సారంగం, పొన్నగంటి రాము, బిట్ల కళావతి, కూతాడి రాజయ్య దేశిని రాధ , గుల్లి పూలమ్మ , దిడ్డి రామ్మోహన్, రావి కంటి రాజు ఉన్నారు.