
స్టేషన్ ఘన్‌పూర్, వెలుగు : రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం ఉన్నా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తక్షణమే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. తన కూతురు కోసం పార్టీ ఫిరాయించి రెండు వందల కోట్లకు ఎమ్మెల్యే అమ్ముడు పోయాడని ఆరోపించారు.
గురువారం చిల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి ఇంటింటా కేసీఆర్ సంక్షేమ పథకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రాజయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తూ కడియం శ్రీహరిపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు చేయాలని పేర్కొన్నారు. ఈనెల30లోపు నిర్ణయం తీసుకోకుంటే కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.