హస్తం పార్టీలోకి మరికొందరు గులాబీ లీడర్లు?

హస్తం పార్టీలోకి మరికొందరు గులాబీ లీడర్లు?
  •     ఎమ్మెల్యే రోహిత్​రావుతో భేటీ 

మెదక్, వెలుగు: మెదక్​ పట్టణంలో బీఆర్ఎస్‌‌కు మరో భారీ షాక్​ తగలనుంది. బుధవారం 6వ వార్డు కౌన్సిలర్​ రాగి వనజ భర్త అశోక్, 4వ వార్డు కౌన్సిలర్ నర్మద​ కొడుకు శ్రీధర్​యాదవ్, 11వ వార్డు కౌన్సిలర్​ సమియుద్దీన్​, 29వ వార్డు కౌన్సిలర్​ రుక్మిణి భర్త కృష్ణ, 32వ వార్డు కౌన్సిలర్​ మానస భర్త గోదల సాయి.. స్థానిక క్యాంపు ఆఫీస్​లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​ రావును కలిశారు. 

మర్యాదపూర్వకంగానే తాము ఎమ్మెల్యేను కలిశామని వారు చెబుతుండగా.. పార్టీ మారేందుకే కలిశారన్న చర్చ నడుస్తోంది. కాగా ఇప్పటికే బీఆర్ఎస్​ టౌన్​ ప్రెసిడెంట్‌‌ గంగాధర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్‌‌ మేడి మధుసూదన్‌‌రావు, కౌన్సిలర్లు మేడి కల్యాణి, జయశ్రీ, వసంత్​.. మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్‌‌లో చేరారు.

నిజాం షుగర్స్‌‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు అడుగులు

నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయని మెదక్​ ఎమ్మెల్యే, ఎన్​ఎస్​ఎఫ్​ పునరుద్ధరణ కమిటీ మెంబర్​ డాక్టర్​ మైనంపల్లి రోహిత్​రావు​ తెలిపారు.  బుధవారం స్థానిక క్యాంప్​ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.    మెదక్​ మండల పరిధి మంబోజిపల్లిలోని మూత పడ్డ చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వానికి నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ లేఖ రాసిందని చెప్పారు. 

2014 వరకు  ఫ్యాక్టరీ నడిచిందని బీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015లో  లే ఆఫ్ ప్రకటించి ఫ్యాక్టరీ మూసేశారన్నారు.  మేనేజ్​మెంట్​ లే ఆఫ్​ ప్రకటించి వేలాది మంది చెరుకు రైతులకు, కార్మికులకు అన్యాయం చేస్తే  బీఆర్​ఎస్​ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని విమర్శించారు.  కాంగ్రెస్​ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మూతపడ్డ నిజాం షుగర్​ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని మాటిచ్చి దాన్ని అమలు చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలతో పునరుద్దరణ కమిటీ ఏర్పాటు  చేసిందన్నారు.