హామీల అమలులో బీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్ : కొలను హనుమంతరెడ్డి

హామీల అమలులో  బీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్ : కొలను హనుమంతరెడ్డి

జీడిమెట్ల, వెలుగు: హామీల అమలులో బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి కొలను హనుమంతరెడ్డి తెలిపారు. కుత్బుల్లాపూర్ గ్రామంలో కాంగ్రెస్ యువ నేత కేపీ విశాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభకు రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్​తో కలిసి ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కొలను హనుమంత రెడ్డి మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ సెగ్మెంట్​లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. ప్రభుత్వ ఆఫీసులు అద్దె భవనాల్లో కొనసాగుతుంటే.. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు సర్కారు స్థలాలను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అవినీతి పాలనను తరిమికొట్టాలంటే ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని  హనుమంతరెడ్డి కోరారు.