మత్స్యకారులను ఆదుకున్నది బీఆర్ఎస్ సర్కారే : ముఠా గోపాల్

మత్స్యకారులను ఆదుకున్నది బీఆర్ఎస్ సర్కారే : ముఠా గోపాల్

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకున్నది బీఆర్ఎస్ సర్కారేనని ఆ పార్టీ ముషీరాబాద్ సెగ్మెంట్ అభ్యర్థి ముఠా గోపాల్ తెలిపారు. మంగళవారం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముషీరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్​లో గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. చీఫ్ గెస్టుగా హాజరైన ముఠా గోపాల్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్య సంపదను పెంపొందించారన్నారు.  

నాలుగున్నర లక్షల టన్నుల చేపలను రాష్ట్రవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తూ దేశంలోనే మత్స్య సంపదలో అగ్రగామిగా నిలిచామన్నారు. అంతకుముందు పలు పార్టీలకు చెందిన యువకులు ముఠా గోపాల్ సమక్షంలో బీఆర్ఎస్​లో చేరారు. ముషీరాబాద్ ఓటర్లు బీఆర్ఎస్ వైపే ఉన్నారని.. తన గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యువ నాయకులు ముఠా జై సింహా, తెలంగాణ ఫిషరీస్ డిపార్ట్ మెంట్ వైస్ చైర్మన్ ధీటి మల్లయ్య, గంగపుత్ర సంఘం నాయకులు స్వరూప, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.