
హైదరాబాద్, వెలుగు: డబుల్ ఇంజన్ సర్కారుతోనే తెలంగాణలో డెవలప్ మెంట్ సాధ్యమని హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం జైరాం ఠాకూర్ అన్నారు. గురువారం బీజేపీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ ఎస్ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని, ఇక్కడ కుటుంబ పాలన కొనసాగుతుందని మండిపడ్డారు.
కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని విమర్శించారు. పిల్లర్లు కుంగడం నాణ్యత లోపాన్ని, అవినీతిని తెలియజేస్తుందని జైరాం ఠాకూర్ అన్నారు. ప్రశ్నపత్రాలు లీకవ్వడం సర్కారు అవినీతికి నిదర్శనమని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం లక్షల కోట్లు నిధులు ఇచ్చిందని ఆయన చెప్పారు.