కాంగ్రెస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు

కాంగ్రెస్లో  చేరిన తుమ్మల నాగేశ్వరరావు

బీఆర్ ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్లి కార్జున్ ఖర్గే.. తుమ్మలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్, కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  రాష్ట్రానికి ముఖ్య నేతలు పాల్గొన్నారు.  

Also Read :- కాంగ్రెస్ లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి

తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో ఇప్పుడు చేరతారు... అప్పుడు చేరతారు అంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగింది. రాష్ట్ర కాంగ్రెస్  చీప్ రేవంత్, భట్టి వంటి పలువురు కాంగ్రెస్ నేతలు తుమ్మల ఇంటికి వెళ్లడం.. మంతనాలు జరపడం కూడా జరిగింది.. అయితే తుమ్మల తన  నిర్ణయాన్ని గుట్టుగా ఉంచారు.  శనివారం ఢిల్లీ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ కు రావడంతో తుమ్మల చేరికపై గతకొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది.ఎట్టకేలకు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.