మాట తప్పిన ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ నేతల ఆందోళన

మాట తప్పిన ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ నేతల ఆందోళన

డంపింగ్ యార్డ్ తొలగింపు విషయంలో మాట తప్పిన ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా తారమతిపేట్ గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు ధర్నా దిగారు. గత కొన్ని సంవత్సరాల నుంచి తారమతిపేట్ పరిసర ప్రాంతాల్లో పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీకి చెందిన డంపింగ్ యార్డ్ చెత్తను తారామతిపేట్ సరిహద్దుల్లో వేస్తున్నారని ఆందోళన చేపట్టారు. ఈ విషయంలో గ్రామస్తులతో పాటు అధికార, విపక్ష పార్టీలు కూడా ఎన్నోసార్లు ధర్నాలు చేసిన తీరు మారలేదని ఆరోపిస్తున్నారు. గతంలో ఇదే విషయంపై ఊర్లోకి వచ్చిన ఎమ్మెల్యేను కూడా నిలదీశామన్నారు.

ఇటీవల ఎమ్మెల్యే కొడుకు పాదయాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా వారం రోజులు తాత్కాలికంగా మూసివేసి డంపింగ్ యార్డ్.. మళ్లీ ఇప్పుడు ఆ పాదయాత్ర అయిపోగానే కంచం తొలగించి మళ్లీ చెత్త వేస్తున్నారుని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన మాట తప్పాడని గ్రహించిన గ్రామస్తులు గ్రామంలోని బీఆర్ఎస్ నాయకులను నిలదీశారు. దీంతో స్థానిక బీఆర్ఎస్ నాయకులు కూడా ధర్నాకు దిగి నిరసన తెలిపారు.