కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరిన బీఆర్ఎస్​ లీడర్లు

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరిన  బీఆర్ఎస్​ లీడర్లు

సుల్తానాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి అసంతృప్తుల వలస కొనసాగుతోంది. రోజూఏదో చోట బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లోకి, కాంగ్రెస్​ నుంచి బీఆర్​ఎస్​కు, రెండు పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారు. శుక్రవారం సుల్తానాబాద్ మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులు, లీడర్లు శుక్రవారం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీలో చేరారు. 

రేగడి మద్దికుంట సర్పంచ్ అన్నేడి రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచులు నామని రాజిరెడ్డి, గుండ మురళి, బొల్లం లక్ష్మణ్,  రామస్వామి, రమా రవి, శ్యామ్ సుందర్ రావు, సింగిల్ విండో డైరెక్టర్ అన్నేడి శ్రీనివాస్ రెడ్డి, ధూళికట్ట సింగిల్ విండో చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్ రావు, డైరెక్టర్లు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రావు, అంజయ్య... కాంగ్రెస్​ అభ్యర్థి విజయరమణారావు సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు.