ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో CBI విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు BRS ఎమ్మెల్సీ కవిత. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు..CBIకి అనుమతిస్తూ ఏప్రిల్ 5వ తేదీ శుక్రవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో శనివారం రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి ఉత్తర్వులను ప్రస్తావించారు. సీబీఐ దరఖాస్తును తమకు అందించలేదన్నారు కవిత తరపు న్యాయవాది. సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోర్టుకు కవిత తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు . కవిత పిటిషన్ పై ఎప్పుడు విచారణ జరుపుతామో ఇవాళ చెప్పాలన్నారు.
అయితే రిప్లే పిటిషన్ దాఖలుకు సీబీఐ తరపున న్యాయవాది టైమ్ కోరారు. దీంతో ఏప్రిల్ 10న మధ్యాహ్నం 12 గంటలకు వాదనలు విననున్నట్లు కోర్టు తెలిపింది. అప్పటి వరకు స్టేటస్ కో కొనసాగించాలని కవిత తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే వాదనలు విన్నాకే ఆదేశాలు ఇస్తామని చెప్పారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతిచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. ప్రస్తుతం కవిత జ్యుడీషియల్ కస్టడీపై తీహార్ జైలులో ఉన్నారు. జైలులోనే ఆమెను ప్రశ్నించనున్నారు సీబీఐ అధికారులు. ప్రశ్నించే ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది కోర్టు. ఒక లేడీ కానిస్టేబుల్ సమక్షంలో కవితను ప్రశ్నించవచ్చని సూచించింది. జైలులోకి ల్యాప్ టాప్, స్టేషనరీ తీసుకువెళ్ళేందుకు సీబీఐకి పర్మిషన్ ఇచ్చింది కోర్టు. దీంతో ఆమె కోర్టకు వెళ్లారు.