బీఆర్ఎస్​ పాలనలో పల్లెలు అభివృద్ధి : ఎమ్మెల్యే సంజయ్  కుమార్

 బీఆర్ఎస్​ పాలనలో పల్లెలు అభివృద్ధి : ఎమ్మెల్యే సంజయ్  కుమార్

రాయికల్/జగిత్యాల టౌన్, వెలుగు:  బీఆర్ఎస్​పాలనలో అనేక పథకాలు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్​తెలిపారు. శుక్రవారం జగిత్యాల టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాయికల్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కష్టాలు తెలిసిన వాడినని, అందుబాటులో ఉండి సేవ చేస్తున్నానని తనను ఆదరించి గెలిపించాలని కోరారు. తన హయాంలో నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు గుర్తు చేశారు. జగిత్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో పాటు 650 పడకల హాస్పిటల్ నిర్మించుకుంటున్నామన్నారు.

పదేళ్ల కింద పల్లెలు ఎట్లా ఉండే.. ఇప్పుడు ఎట్లా ఉన్నాయో ప్రజలు ఆలోచించాలన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచాక అల్లిపూర్ గ్రామాన్ని మండలకేంద్రంగా మారుస్తామన్నారు. జగిత్యాల బల్దియా పరిధిలో 1,2,23,24,39,46 వార్డుల్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు.  కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బర్కం మల్లేశం, సర్పంచ్ జీవన్ రెడ్డి, అల్లీపూర్ ఉపసర్పంచ్ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఎంపీటీసీ విజయలక్ష్మి, లీరడ్లు మహేశ్​, రత్నాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, రాజలింగం, శ్రీనివాస్, తిరుపతిగౌడ్, పాల్గొన్నారు. అనంతరం రాయికల్ మండల అయోధ్యకు చెందిన 20 మంది, కిష్టంపేట్​గ్రామానికి చెందిన 15 మంది యువకులు బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు.