
సీతారామ ప్రాజెక్ట్ ఘనత కేసీఆర్ దేనన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఖమ్మం జిల్లా ప్రజల కరువుతీరాలన్న సంకల్పంతో కేసీఆర్.. సీతారామ ప్రాజెక్టును మొదలు పెట్టారని చెప్పారు. ప్రాజెక్ట్ నిర్మాణం 90 శాతం పూర్తయిందని చెప్పారు. తాము చేసిన పనులకు కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తోందని విమర్శించారు. సీతారామ ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ ఆరు నెలల్లోనే పూర్తి చేసిందా? అని ప్రశ్నించారు హరీశ్ రావు.. ఇతరుల ఘనతను కాంగ్రెస్ తమ ఘనతగా చెప్పుకుంటుందన్నారు. పూర్తి చేసింది బీఆర్ఎస్ అయితే..కాంగ్రెస్ రిబ్బన్ కట్ చేస్తుందని చెప్పారు.
రాజకీయాలు, ఓట్ల కోసం ప్రాజెక్టులు కట్టరని చెప్పారు హరీశ్. 8 ప్యాకేజీల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది..మరో 3 ప్యాకేజీల్లో 80 శాతం పనులు తామే పూర్తి చేశామన్నారు. మంత్రి ఉత్తమ్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. క్రెడిట్ కోసం మంత్రులు పోటీపడుతున్నారు.. కాంగ్రెస్ నేతల డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.