కాంగ్రెస్ మీటింగ్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే

కాంగ్రెస్ మీటింగ్కు  బీఆర్ఎస్ ఎమ్మెల్యే

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకున్న సంగతి తెలిసిందే. చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, కీలక నేతలు, మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేటర్లు  బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు.  బీఆర్ఎస్ నుంచి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు  ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే  కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరారు. మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరతారనే ప్రచాం జరిగినా పార్టీ మారలేదు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. 

అయితే ఎన్నికల ఫలితాలు వచ్చాక మొదటగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అప్పటి నుంచి ఆయన  కాంగ్రెస్ లోచేరుతారనే ప్రచారం జరుగుతోంది.  ఇటీవల జరిగిన కాంగ్రెస్ సభలు, సమావేశాలకు  తెల్లం వెంకట్రావు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.  ఆ మధ్యలో  మణుగూరులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న బహిరంగ సభకు తెల్లం హాజరయ్యారు. మళ్లీ ఇవాళ ఏప్రిల్ 2న మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో ఇల్లందులో ఎంపీ ఎన్నికలపై జరిగిన రివ్యూ మీటింగ్ కు తెల్లం అటెండ్ అయ్యారు. దీంతో తెల్లం త్వరలోనే కాంగ్రెస్ లో  చేరడం ఖాయని చర్చించుకుంటున్నారు. ఇదే జరిగితే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరుతుంది.