సీఎం రేవంత్ రెడ్డితో కేకే భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో కేకే భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో సీనియర్ పొలిటీషియన్ కె.కేశవరావు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన మార్చి 29వ తేదీ ఉదయం.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోనున్నట్లు సమాచారం. చేరిక తేదీ ఎప్పుడు అనేది ఇంకా వెల్లడి కాలేదు.

కె.కేశవరావు బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ గా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి 24 గంటల ముందు.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో.. ఆయన ఫాంహౌస్ లో చర్చించారు. ఆ తర్వాతే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కేశవరావు కాంగ్రెస్ పార్టీలోనే సుదీర్ఘకాలం పని చేశారు. సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వైపు వెళ్లారు. ఇప్పుడు తిరిగి సొంత పార్టీలోకి వస్తున్నారు కేశవరావు. 

కేశవరావు కుమార్తె హైదరాబాద్ మేయర్ గా ఉన్నారు. విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. 


  • Beta
Beta feature