బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీటీసీలు

బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీటీసీలు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్ ఎంపీటీసీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చుంచు మల్లవ్వ-, లక్ష్మీనారాయణ దంపతులు, లింగపూర్ ఎంపీటీసీ, బీఆర్ఎస్ నాయకులు బోడ అమృత-,నర్సింగ్ నాయక్ దంపతులు బీజేపీలో చేరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​ఆధ్వర్యంలో అభివృద్ధి జరగడంలేదని, అందుకే ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. 

రైతుల సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే దివాకర్ రావు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. రఘునాథ్ మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో పేద ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ సర్కారు పూర్తిగా విఫలమైందని అన్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు, నిరుద్యోగ భృతి, నూతన పెన్షన్లతోపాటు అనేక హామీలు నెరవేర్చలేదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పోనుగోటు రంగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రజినీష్ జైన్ తదితరులు పాల్గొన్నారు.