జగిత్యాల చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ ఎన్నికపై .. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో టెన్షన్‌‌‌‌‌‌‌‌ 

జగిత్యాల చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ ఎన్నికపై .. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో టెన్షన్‌‌‌‌‌‌‌‌ 
  • సన్నిహితులకే బల్దియా పీఠం దక్కేలా ఎమ్మెల్యే ప్లాన్ 
  • ఎమ్మెల్యే నిర్ణయంపై కౌన్సిలర్ల అసంతృప్తి
  • నేడు చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌  ఎన్నికకు మీటింగ్​ 
  • ఇప్పటికే గోవా టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 22 మంది  బీఆర్ఎస్ కౌన్సిలర్లు
  •  గ్రూపులు కడుతున్న ఆశావహులు

జగిత్యాల, వెలుగు : జగిత్యాల బల్దియా చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌  ఎన్నిక  బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి టెన్షన్‌‌‌‌‌‌‌‌  పట్టుకుంది. తన సన్నిహితులైన సమిండ్ల వాణికి బల్దియా కుర్చీ దక్కేలా ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌‌‌‌‌కుమార్​ ప్లాన్​ చేశారు. అయితే నిర్ణయంపై మెజారిటీ కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బల్దియా కౌన్సిలర్లు గ్రూపులుగా విడిపోగా.. నేడు జరిగే చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ ఎన్నిక మీటింగ్‌‌‌‌‌‌‌‌పై ఉత్కంఠ నెలకొంది.  

గోవాకు 19 మంది కౌన్సిలర్లు 

బల్దియాలోని మొత్తం 47 మంది కౌన్సిలర్లు ఉండగా.. 36 మంది బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి చెందినవారే. వీరిలో ఇప్పటికే 19 మందిని గోవా టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపించారు. బుధవారం జరిగే చైర్ పర్సన్ ఎన్నికకు హాజరై తాను మద్దతు ఇస్తున్నవారిని ఎన్నుకునేందుకు ఎమ్మెల్యే ఏర్పాట్లు చేశారు. అయితే తమ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని కొందరు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఎమ్మెల్యే నిర్ణయంపై కౌన్సిలర్ల గుర్రు

మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన సమిండ్ల వాణికి  చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ పీఠాన్ని ఫైనల్ చేస్తూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిర్ణయించారు. సమిండ్ల వాణి భర్త శ్రీనివాస్ ఎమ్మెల్యేకు సన్నిహితుడు కావడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే ఇదే సామాజికవర్గానికి చెందిన దావ వసంత జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌గా ఉండగా.. బల్దియా పీఠం కూడా వారికే కేటాయించడంపై పద్మశాలీ వర్గ నేతలు గుర్రుగా ఉన్నట్లు వినిపిస్తోంది. పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన భోగ శ్రావణి  చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ పదవికి గతంలో రాజీనామా చేయగా.. ఆమె స్థానాన్ని అదే సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్ అడువాల జ్యోతితో భర్తీ చేస్తారని అంతా భావించారు.

మరోవైపు ఎమ్మెల్సీ కవిత అనుచరుడైన రాష్ట్ర ఒడ్డెర సంఘ అధ్యక్షుడు వల్లెపు మొగిలి భార్య వల్లెపు రేణుక కూడా పోటీలో నిలిచారు.  కానీ పాలకవర్గం ఏర్పాటు చేసే టైంలోనే మూడేళ్లు బోగ శ్రావణి, రెండేళ్లు సమిండ్ల వాణికి పదవులను కేటాయిస్తానని మాట ఇచ్చానని, దానిలో భాగంగా వాణికే మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే.. కౌన్సిలర్లకు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. 

ఫైనల్ చేసినా.. తప్పని టెన్షన్​

చైర్ పర్సన్ పదవి ఫైనల్ అయినప్పటికీ ఎమ్మెల్యే నిర్ణయాన్ని పక్కనపెట్టిన ఆశావాహులు అడువాల జ్యోతి, వల్లెపు రేణుక.. ఇతర కౌన్సిలర్ల మద్దతు కూడగడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. ఒకే సామాజిక వర్గానికి రెండు పదవులివ్వడాన్ని వ్యతిరేకిస్తూ కౌన్సిలర్లు సైతం వారికి మద్దతు పలుకుతూ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. గోవా టూర్ కు వెళ్లని 17 మంది కౌన్సిలర్లతోపాటు టూర్ కు వెళ్లినవారు సైతం  కొందరు ఎమ్మెల్యే నిర్ణయంతో విభేదిస్తూ ఆశావాహులతో టచ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం జరిగే సమావేశంలో సమిండ్ల వాణికి పదవి దక్కుతుందా..? లేక మద్దతు కూడగడుతున్న మిగతా ఇద్దరిలో ఎవరికి బల్దియా పీఠం దక్కనుందో మరికొద్దిగంటల్లో తేలనుంది.