ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం నగరంలోని ప్రకాశ్‌నగర్ వద్ద మున్నేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడం ప్రజా ప్రయోజనాలను విస్మరించిన చర్య అని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. బుధవారం చెక్‌డ్యామ్‌ను కూల్చివేసిన ప్రాంతాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు సందర్శించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో సుమారు రూ.8 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యామ్ వల్ల భూగర్భ జలమట్టం పెరిగి ఖమ్మం నగరంలో తాగునీటి సమస్యకు ఉపశమనం లభించిందని తెలిపారు.
రాజకీయ కక్షసాధింపు ధోరణితో ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండానే చెక్‌డ్యామ్‌ను కూల్చివేశారని ఆరోపించారు. భవిష్యత్తులో నగరం తాగునీటి సమస్యను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు గుండాల కృష్ణ, బచ్చు విజయ్‌కుమార్ తదితరులున్నారు.
