
చెన్నూరు, వెలుగు: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో కోటపల్లి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్యూత్ కార్యకర్తలు, లీడర్లు కాంగ్రెస్లో చేరారు. శనివారం రాత్రి చెన్నూరు మంత్రి క్యాంపు ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్ బోయిని రాజలింగు నేతృత్వంలో కోటపల్లి మండలం వెల్మపల్లికు చెందిన బీఆర్ఎస్ మండల యూత్ జనరల్ సెక్రటరీ ఐత రాజేందర్‌రెడ్డి, తన అనుచరులైన పలువురితో కాంగ్రెస్లో చేరగా వారికి మంత్రి కండువాలు వేసి ఆహ్వానించారు.
వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధికి అకర్షితులై కాంగ్రెస్లో చేరినట్లు రాజేందర్‌రెడ్డి తెలిపారు. అంతకు ముందు మంత్రి ప్రజలను నుంచి పలు వినతులు తీసుకున్నారు. చెన్నూరు మండలాల కాంగ్రెస్లీడర్లు మహేశ్తివారీ, హేమంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.