
చదివిందొకటి.. పరీక్షకు వెళ్తే ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఇంకొకటి.. అది తమ సబ్జెక్టు కాదన్న స్టూడెంట్లతో కాలేజీ నిర్వాహకులు బలవంతంగా పరీక్ష రాయించారు. ఎలారాస్తే ఎట్లా పాసవుతామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ వాగ్దేవి డిగ్రీ కళశాల సెంటర్‌లో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. మంగళవారం 120 మంది బీకామ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లు పరీక్ష రాశారు. వారికి పోగ్రామ్ఇన్సీ ల్వాంగేజీ పేపర్ ఇవ్వాల్సి ఉండగా, సెంటర్ నిర్వాహకులు బిఏ, బిఎస్సీ గ్రూప్ సంబంధించిన కంప్యూటర్ అప్లికేషన్ప్రశ్నపత్రం ఇచ్చారు. తమ సబ్జెక్టు కాని పేపర్ వచ్చిందని చెప్పినా వారు వినిపించుకోలేదు. పరీక్ష రాసేంతవరకు వదల్లేదు. యూనివర్శిటి నుండి వచ్చినా ప్రశ్నాపత్రాలనే స్టూడెంట్లకు ఇచ్చామని, విషయాన్ని యూనివర్శిటి అధికారులకు తెలియజేస్తామని సెంటర్ నిర్వాహకులు చెప్తున్నారు.