ప్రొఫెసర్ల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

ప్రొఫెసర్ల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

హైదరాబాద్ : ప్రొఫెసర్ కాశీంతో పాటు20 మంది OU ప్రొఫెసర్లపై నమోదైన కేసులపై బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాల కోసం శాంతియుతంగా పోరాడుతున్న ప్రొఫెసర్ కాశీంతో పాటు20 మంది OU ప్రొఫెసర్లపై అక్రమంగా కేసులు పెట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. తెలంగాణ విద్యా వ్యవస్థను నాశనం చేసి, మద్యాన్ని చవకగా పంపిణీ చేసి.. ఒక తరాన్ని నాశనం చేసినందుకు ముఖ్యమంత్రిపై కేసు పెట్టాలంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.