మహబూబాబాద్ లో రోడ్డు ప్రమాదం.. బీఎస్ఎఫ్ జవాన్ మృతి

మహబూబాబాద్ లో  రోడ్డు ప్రమాదం.. బీఎస్ఎఫ్ జవాన్ మృతి

మహబూబాబాద్ జిల్లా రోడ్డు ప్రమాదంలో బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందాడు.కొత్తగూడ మండలం పెగడపల్లి శివారులో ద్వి చక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో  తీవ్రంగా గాయపడిన    బిఎస్ఎఫ్ జవాన్ మద్దెల ప్రకాష్  ను  వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా  చికిత్స పొందుతూ మృతి చెందాడు. 


జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న  ప్రకాష్  ఐదు రోజుల క్రితం సెలవుల పై   స్వగ్రామం గంగారం మండలం అందుగుల గూడెంకు వచ్చాడు.  పెగడపల్లిలో విందుకు హాజరై వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జవాన్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.