పంజాబ్లో పాక్ డ్రోన్ల కలకలం..కూల్చేసిన  బీఎస్ఎఫ్

పంజాబ్లో పాక్ డ్రోన్ల కలకలం..కూల్చేసిన  బీఎస్ఎఫ్

భారత భూభాగంలో పాకిస్థాన్ డ్రోన్లు కలకలం సృష్టించాయి. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న డ్రోన్లను బీఎస్ఎఫ్ దళాలు కూల్చేశాయి. చొరబాటును అడ్డుకునే క్రమంలో బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు జరిపినట్లు అదికారులు తెలిపారు. నేలకూలిన డ్రోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

డ్రోన్లు పడ్డ కిల్చా గ్రామాన్ని బీఎస్ఎఫ్ అధికారులు చుట్టుముట్టారు. గతంలో డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ మారణాయుధాలతో పాటు డ్రగ్స్ ను సరఫరా చేసిందని.. అందుకే సరిహద్దుల వెంట అలెర్ట్ గా ఉన్నామని అధికారులు తెలిపారు.