
ఢిల్లీ: దేశవ్యాప్తంగా రేపటి నుంచి ( శనివారం, సెప్టెంబర్ 27) బీఎస్ఎన్ఎల్ 4 జీ నెట్ వర్క్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా వెల్లడించారు. రూ.37 వేల కోట్లతో స్వదేశీ పరి జ్ఞానంతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసినట్లు తెలిపారు.
97,500 టవర్ల ద్వారా బీఎస్ఎన్ఎల్ 4 జీ సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రకటిం చారు. ఈ టవర్లను 5 జీ సేవలకు కూడా అప్ గ్రేడ్ చేసుకునే అవకాశమున్నట్లు తెలిపారు. రేపు ఈ సేవలను ఒడిశా నుంచి ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.