జులైలో ప్రముఖ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను అమాంతం పెంచేయడంతో మొబైల్ యూజర్లు బీఎస్ఎన్ఎల్ బాట పడుతున్నారు. జియో, ఎయిర్టెల్, వీఐ టారిఫ్ ధరలు పెంచాక పోర్ట్ ఆప్షన్ ఎంచుకుని దేశవ్యా్ప్తంగా 2.75 మిలియన్ల మంది బీఎస్ఎన్ఎల్కు మారిపోయారు. ఇదే సరైన తరుణంగా భావించి బీఎస్ఎన్ఎల్ మరింత మంది యూజర్లను ఆకర్షించేందుకు సిద్ధమైంది. అతి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. బీఎస్ఎన్ఎల్ ఇందులో భాగంగా.. 107 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చింది. 107 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 35 రోజుల వ్యాలిడిటీతో 3జీబీ 4జీ డేటాతో పాటు రోజుకు 200 నిమిషాల వాయిస్ కాల్స్ ఫ్రీగా చేసుకునే అవకాశం యూజర్లకు ఉంది.
107 రూపాయల్లో 35 రోజుల వ్యాలిడిటీతో ఇతర టెలికాం కంపెనీల రీఛార్జ్ ప్లాన్స్ ఏవీ లేకపోవడం గమనార్హం. అయితే వాయిస్ కాల్స్ పరిమితంగా చేసుకునే వారికి మాత్రమే 107 రూపాయల ప్లాన్ వల్ల ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా.. 3జీబీ డేటా మాత్రమే పొందే అవకాశం ఉంది కాబట్టి డేటాతో కూడా పెద్దగా పనిలేని వారికి మాత్రమే ఈ 107 రూపాయల ప్లాన్ పనికొస్తుంది. ఇక.. బీఎస్ఎన్ఎల్ 108 రూపాయల ఫస్ట్ రీఛార్జ్ కూపన్ కూడా అందుబాటులో ఉంది. కొత్త యూజర్లకు మాత్రమే ఈ 108 రూపాయల ప్లాన్ వర్తిస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 1జీబీ 4జీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో యూజరు పొందొచ్చు. ఇక.. బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన చీఫ్ అండ్ బెస్ట్ ప్లాన్స్పై ఓ లుక్కేయండి.
* బీఎస్ఎన్ఎల్ 197 ప్లాన్: అన్ లిమిటెడ్ కాల్స్, 2జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు(తొలి 18 రోజుల వరకు పొందొచ్చు).
* బీఎస్ఎన్ఎల్ 197 ప్లాన్:199 రూపాయల ప్లాన్తో 70 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు.
* బీఎస్ఎన్ఎల్ 397 ప్లాన్: 150 రోజుల వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్, 2జీబీ 4జీ డేటా (తొలి 30 రోజుల వరకు పొందొచ్చు)
* బీఎస్ఎన్ఎల్ 797 ప్లాన్: 300 రోజుల వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్, 2జీబీ 4జీ డేటా (తొలి 60 రోజుల వరకు పొందొచ్చు)
* బీఎస్ఎన్ఎల్ 1999 ప్లాన్: 365 రోజుల వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్, 600 జీబీ 4జీ డేటా. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ పొందే అవకాశం
బడ్జెట్ ఫ్రెండ్లీలో టెలికాం సేవలను పొందే ఉద్దేశం ఉన్న యూజర్లు, జియో, ఎయిర్టెల్, వీఐ రీఛార్జ్ ప్లాన్ల ధరల పెంపును భారంగా భావిస్తున్న కస్టమర్లు బీఎస్ఎన్ఎల్కు మారిపోతున్నారు. యూజర్లకు ఇలాంటి ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రకటిస్తూ జియో, ఎయిర్టెల్పై బీఎస్ఎన్ఎల్ పరోక్షంగా ఒత్తిడి పెంచుతుండటం గమనార్హం.