
డిమాండ్ల సాధన కోసం BSNL ఉద్యోగులు ఆందోళన భాట పట్టారు.రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ టెలిఫోన్ ఎక్చేంజ్ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఉద్యోగులు తక్షణమే తమ డిమాండ్ల ను పరిష్కరించాలని కోరారు. 4G స్పెక్ట్రం ను BSNL కు కేటాయించాలని, 15 పర్సెంట్ ఫిట్ మెంట్ తో వేతన సవరణ చెయ్యాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షన్ కంట్రిబ్యూషన్ చెల్లింపునకు BSNL ను అనుమతించాలని, మొబైల్ టవర్స్ నిర్వహణ బాధ్యతలను ఔట్ సోర్సింగ్ కు ఇవ్వాలనే ఆలోచనను విరమించాలని తదితర 8 ప్రధాన డిమాండ్ల తో దేశ వ్యాప్తంగా నేటి నుంచి BSNL ఉద్యోగులు సమ్మె భాట పట్టారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఈ సమ్మె కొనసానున్నట్లు BSNL ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు.