జియో, ఎయిర్‌టెల్ కి పోటీగా BSNL.. ఈ నెలలోనే 5G నెట్వర్క్ లాంచ్..

జియో, ఎయిర్‌టెల్ కి పోటీగా BSNL.. ఈ నెలలోనే 5G  నెట్వర్క్ లాంచ్..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్. మరికొద్దిరోజుల్లోనే  BSNL 5G సేవలు ప్రారంభం కానున్నాయి. కస్టమర్ల డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచాలనే ఉదేశ్యంతో కంపెనీ అఫీషియల్ Xద్వారా దీనికి సంబంధించి ట్వీట్ చేసింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ప్రొవైడర్ BSNL 5G సర్వీసెస్ ప్రారంభించడం వల్ల ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ కంపెనీలకు పోటీ పెరుగుతుంది. 

ప్రతినెల రివ్యూ మీటింగ్: భారత టెలికాం రంగంలో తొలిసారిగా BSNL కోసం రివ్యూ మీటింగ్ జరిగిందని, దీనికి కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి అలాగే కేంద్ర కమ్యూనికేషన్ల సహాయ మంత్రి ఇద్దరూ హాజరయ్యారని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పార్లమెంటులో పేర్కొన్నారు.

ఇక మీదట కూడా ప్రతినెల రివ్యూ మీటింగ్స్ కమ్యూనికేషన్ల సహాయ మంత్రి అధ్యక్షతన జరుగుతాయి. అయితే, 3నెలలకి ఒకసారి రివ్యూ మీటింగ్లకు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షత వహిస్తారు. అలాగే కంపెనీ ARPUను పెంచుకోవాలని ఆదేశించింది.  

 మరోవైపు వోడాఫోన్ కూడా 5G సేవలను ప్రారంభించే పని ఉంది. BSNL  4G సేవలను మెరుగుపరచడానికి కృషి చేస్తూ, 5Gని ప్రవేశపెట్టడానికి కూడా సన్నాహాలు చేస్తోంది. ఇవన్నీ ఉన్నప్పటికీ, రెండు కంపెనీలు కస్టమర్లను కాపాడుకోవడానికి  ఎంతో కృషి చేస్తున్నాయి. జూన్‌లో వోడాఫోన్ ఐడియా (Vi) 2,17,000 మందికి పైగా కస్టమర్లను కోల్పోగా, BSNL దాదాపు 3,06,000 మంది కస్టమర్లను కోల్పోయింది. 

ప్రస్తుతం, Viకి దాదాపు 20 కోట్ల మంది కస్టమర్లు ఉండగా, BSNLకి  దాదాపు 9 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. దింతో మార్కెట్‌లో BSNL వాటా 7.82 శాతం నుండి 7.78 శాతానికి కాస్త తగ్గింది, అయితే Vi వాటా కూడా 17.61 శాతం నుండి 17.56 శాతానికి పడిపోయింది.