యూసీసీకి మేము వ్యతిరేకం కాదు.. కేంద్రం తీరుపైనే మా అభ్యంతరం : మాయావతి

యూసీసీకి మేము వ్యతిరేకం కాదు.. కేంద్రం తీరుపైనే మా అభ్యంతరం : మాయావతి

యూసీసీకి మేము వ్యతిరేకం కాదు

కేంద్రం తీరుపైనే మా అభ్యంతరం : మాయావతి

లక్నో : యూనిఫాం సివిల్  కోడ్  (యూసీసీ) కు తమ పార్టీ వ్యతిరేకం కాదని, అయితే దానిని కేంద్రం అమలు చేయాలనుకుంటున్న తీరుపైనే అభ్యంతరం తెలుపుతున్నామని బహుజన్  సమాజ్  పార్టీ (బీఎస్పీ) చీఫ్​  మాయావతి అన్నారు. పౌరులందరికీ యూసీసీ ఉండాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 సూచిస్తున్నదని, అయితే, దానిని బలవంతంగా అమలు చేయరాదని ఆమె పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల ఏకాభిప్రాయంతోనే యూసీసీని అమలు చేయాలని, దానిపై అనుమానాలు ఉన్నవారికి అవగాహన కల్పించాలని సూచించారు. కానీ, ఏకాభిప్రాయం, అవగాహన లేకుండా యూసీసీని అమలుచేసే ప్రయత్నం జరుగుతున్నదని ఆమె వ్యాఖ్యానించారు. 

‘‘అన్ని మతాల వారికి యూసీసీ ఉంటే దేశం బలోపేతం అవుతుంది. అలాగే పౌరుల మధ్య సోదరభావం, సామరస్యం పెంపొందుతుంది. పుట్టుక నుంచి చావు వరకు వివిధ ఆచారాలు, సంప్రదాయాలు పాటించే వేర్వేరు మతాలు ఉన్నవారికి నిలయం మన దేశం. ఈ నేపథ్యంలో ఏకాభిప్రాయం, అవగాహనతోనే యూసీసీని అమలు చేయడం ఉత్తమమైన మార్గం. కానీ, అలా జరగడం లేదు” అని మాయావతి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.