కాగజ్​నగర్​ ఎస్పీ, అధికారులంతా ఉత్సవ విగ్రహాలు : ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్​

కాగజ్​నగర్​ ఎస్పీ, అధికారులంతా ఉత్సవ విగ్రహాలు  : ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్​

కాగజ్ నగర్, వెలుగు : సిర్పూర్​ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దౌర్జన్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని బీఎస్పీ అధ్యక్షుడు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం కాగజ్​నగర్​లోని పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్ నేత రాజ్ కుమార్ యాదవ్ పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఎస్పీ సురేశ్​కుమార్​సహా అధికారులందరూ ఉత్సవ విగ్రహాలుగా మారి, కోనప్ప చేతిలో బందీ అయ్యారని ఆరోపించారు. 

15 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉండి కనీసం రోడ్లు కూడా వేయలేని ఎమ్మెల్యే ఏం ముఖం పెట్టుకుని పల్లెల్లో తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు బీఎస్పీలో చేరారు. బెంగాలీ క్యాంప్ నెంబర్ 7 లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్,రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, జిల్లా ఇంఛార్జి సోయం చిన్నయ్య పాల్గొన్నారు.

ప్రవీణ్ కుమార్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ 

కాగజ్ నగర్ సమీపంలోని పెడవాగు దగ్గర ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న ప్రవీణ్ కుమార్ వాహనానికి ప్రమాదం జరిగింది. ఆయన కారును ఓ లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో కారు డ్యామేజీ అయ్యింది. ప్రవీణ్ కుమార్ సహా మిగిలిన వారంతా సురక్షితంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు.