ఏడాదైనా పూర్తికాని  బీటీ రోడ్డు పనులు

ఏడాదైనా పూర్తికాని  బీటీ రోడ్డు పనులు

మందమర్రి,వెలుగు:మందమర్రి-–నెన్నెల మండలాల మీదుగా రూ.8.45 కోట్ల వ్యయంతో చేపట్టిన  బీటీ రోడ్డు పనులు అంసపూర్తిగా మిగిలాయి. ఏడాది దాటినా పనులు పూర్తికాకపోవడంతో మందమర్రి, నెన్నెల మండలాల పరిధిలోని 10 పంచాయతీల పరిధిలోని ప్రజలు రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.  వాగులపై వంతెనల నిర్మాణ,  అప్రోచ్​రోడ్డు పనులు పూర్తికాకపోవడంతో వర్షాకాలం ప్రారంభం నుంచి ఆర్టీసీ ఆఫీసర్లు బస్సులు నిలపివేశారు. 

ఏడాది క్రితం పనులు...

పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో  5.5 మీటర్ల వెడల్పుతో  3.75 మీటర్ల రోడ్డును నిర్మిస్తున్నారు. మందమర్రి జూనియర్​ కాలేజీ నుంచి  మామిడిగట్టు మీదుగా నెన్నెల మండలం ఆవుడం వరకు  గతఏడాది జులై 20న రూ.8.45 కోట్ల  పీఎంజీఎస్​వై ఫండ్స్​తో సుమారు 18 కి.మీల బీటీ రోడ్డు పనులకు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్​ శంకుస్థాపన చేశారు. 

నిలిచిన బస్సు సౌకర్యం...

మందమర్రి, నెన్నెల మండలాలను కలుపుతూ నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనుల్లో భాగంగా నాలుగు చోట్ల వాగులపై వంతెనలు నిర్మాణం చేపట్టారు. ఏడాది క్రితం ప్రారంభించిన పనులు ఇంతవరకు పూర్తికాలేదు. తుర్కపల్లి,- ఆదిల్​పేట మధ్య రెండుచోట్ల, ఆదిల్​పేట- కొండెంగల వాగు మధ్య, మామిడిగట్టు- ఆవడం గ్రామాల మధ్య వంతెనల పనులు స్లోగా నడుస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వంతెన వద్ద బురదమయం కావడం, మట్టితో నిర్మించిన అప్రోచ్​రోడ్లు కొట్టుకుపోవడంతో ఆర్టీసీ వారు బస్సులు నిలిపివేశారు. 

సేఫ్టీ వాల్స్ లేకుండా...

నాలుగు చోట్ల వంతెనల నిర్మాణ పనులు అసంపూర్తిగా మారాయి. వంతెనలకు సేఫ్టీ వాల్  కట్టకుండా, పిల్లర్ల కోసం సలాకలు పెట్టి వదిలేశారు.సేఫ్టీ వాల్స్​ లేకపోవడంతో వెహికల్స్ అదుపుతప్పితే  వాగులు, ఒర్రెల్లో పడే ప్రమాదం ఉంది. మామిడిగట్టు- అవడం మధ్య వంతెనకు ఫారెస్ట్​పర్మిషన్​ఇవ్వకపోవడంతో 2 కి.మీ పొడువు రోడ్డు వెడల్పు పనులూ చేపట్టలేదు. మూలమలుపు సైతం ప్రమాదకరంగా మారింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

పనుల్లో నిర్లక్ష్యం

మందమర్రి- ఆవడం మధ్య బీటీ రోడ్డు పనులు పూర్తి చేయిచండంలో ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్రు. ఏడు నెలలుగా బస్సు సౌకర్యం లేక ప్రజలు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షకాలం దాటినా పనులు స్పీడ్​ చేయడంలేదు.
-వంజరి వెంకటేశ్, బీజేపీ లీడర్​