పోలంపల్లిలో బీటీ 3 పత్తి విత్తనాల పట్టివేత

పోలంపల్లిలో బీటీ 3 పత్తి విత్తనాల పట్టివేత

జైపూర్(భీమారం), వెలుగు: భీమారం మండల కేంద్రంతో పాటు పోలంపల్లిలో ఇద్దరు వ్యక్తుల నుంచి నిషేధిత బీటీ 3​పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్వేత తెలిపారు. మండల కేద్రానికి చెందిన రేషవేణి సత్యనారాయణ, అన్నవేని నర్సయ్య నిషేధిత బీటీ 3 విత్తనాలు అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

 దీంతో భీమారం, పోలంపల్లి శివారులో పత్తి చేన్లలో తిరుగుతున్న ఆ ఇద్దరిని పోలీసులు పట్టుకొని వారి వద్ద నుంచి 3.7 కేజీల బీటీ 3 విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వారు ఈ విత్తనాలను మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.