యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల, మానస చౌదరి జంటగా రవికాంత్ పేరేపు తెరకెక్కించిన చిత్రం ‘బబుల్‌గమ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంస్థలు కలిసి నిర్మించాయి. డిసెంబర్ 29న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా ప్రీ బుకింగ్ ఈవెంట్‌ను నిర్వహించారు. హీరోలు అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, డైరెక్టర్ నందిని రెడ్డి అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.
రోషన్ కనకాల మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో మనందరికీ ఉండే ఎమోషన్స్ ఉంటాయి. ఈ ఎమోషన్‌ని ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటాయి. మానస చాలా హార్డ్ వర్క్ చేసింది. శ్రీచరణ్ క్రేజీ మ్యూజిక్ ఇచ్చారు. ఒక మనిషి సక్సెస్‌ని నిర్ణయించేది అతని హార్డ్ వర్క్, ప్రతిభ, క్రమశిక్షణ. మనందరి నసీబ్‌లో ఏం రాసిపెట్టుందో ఎవరికీ తెల్వదు. కానీ నచ్చినట్లు మార్చుకుంటాం.
కావాల్సింది లాక్కుని తెచ్చుకుంటాం’ అని చెప్పాడు. తన తొలి చిత్రానికే ప్రాధాన్యత వున్న పాత్ర దొరకడం ఆనందంగా ఉందని చెప్పింది మానస. ఇదంతా టీమ్ ఎఫర్ట్ అని.. అందరికీ నచ్చుతుందన్నాడు రవికాంత్. ‘నటన తన జీన్స్‌లో ఉంది. ట్రైలర్‌లో రోషన్ విశ్వరూపం కనిపించింది’ అని చెప్పారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.
