పెద్ద స్కెచ్చే..బబుల్గమ్,జిలేబిలతో పోలీసులకు పట్టుబడ్డ..యాంకర్ సుమ కొడుకు

పెద్ద స్కెచ్చే..బబుల్గమ్,జిలేబిలతో పోలీసులకు పట్టుబడ్డ..యాంకర్ సుమ కొడుకు

నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా సినిమా టాలీవుడ్ కి పరిచయమవుతున్నారు. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నడైరెక్టర్ రవికాంత్ పెరేపు తెరకెక్కిస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

అసలు విషయానికి వస్తే.. 

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల జోరు భారీ ఎత్తున సాగుతుండటంతో..అటెన్షన్ పాలిటిక్స్ అన్నట్టు నడుస్తోంది. దీంతో కాస్త అనుమానం వచ్చినా రోడ్డుపై వెహికల్‌ను ఆపి మరి..పోలీసులు చెక్ చేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండటంతో..అక్రమంగా మద్యం బాటిల్స్ ను, నోట్ల కట్టలను తరలిస్తారనే అనుమానంతో..పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. అయితే లేటెస్ట్ గా పోలీస్ రైడింగ్‌లో యాంకర్ సుమ కొడుకు రోషన్ అడ్డంగా దొరికిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సరదాగా..పాటలు వింటూ..రోషన్ తన ఫ్రెండ్స్‌తో కలిసి..కారులో వెళ్తుండగా..వారి బిహేవియర్ పై..అనుమానం వచ్చిన పోలీసులు కారుని ఆపి..ఎక్కడ నుంచి వస్తున్నారు? ఎటూ వెళ్తున్నారు ? అని ప్రశ్నలు వేయగా..రోషన్ అండ్ ఫ్రెండ్స్ తిక్క తిక్క సమాధానాలు చెప్పడంతో..గరం అయిన పోలీసులు కారుని చెక్ చేయడానికి రెడీ అవుతారు. 

ఇక రోషన్ భయం.. భయంతో..ఆ కారు డిక్కీ ఓపెన్ చేసి చూడగా అందులో అనుమానంగా రెండు సూట్ కేసులు కనబడతాయి. సడెన్ గా పోలీసులు షాక్ అవుతూ..చాలా పెద్ద స్కెచ్ వేశారంటూ..సెటైర్ వేస్తూ..ఆ సూట్ కేసులో ఏమున్నాయా అని తెరిచి చూస్తే.. బబుల్గమ్ లు,జిలేబిలు కనిపిస్తాయి. షాక్ అయ్యారు కదూ. పోలీసులు కూడా మీలాగే షాక్ అయ్యారు. 

ప్రస్తుతం రోషన్ ‘బబుల్గమ్’(Bubblegum) అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.ఇందులో భాగంగానే బబుల్గమ్ మూవీ ప్రమోషన్స్‌ను ఎలక్షన్స్కు టచ్ ఉండేలా కొత్తరకంగా ప్లాన్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ నుంచి భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి.