ఆర్సీ16 కోసం బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. అందుకే చరణ్ ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు.

ఆర్సీ16 కోసం బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. అందుకే చరణ్ ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) తరువాతి సినిమా కోసం బుచ్చిబాబు(Buchibabu sana) మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాడట. పాన్ ఇండియా రేంజ్ లో రానున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఒక పవర్ ఫుల్, రా అండ్ రస్టిక్ స్టోరీని సిద్ధం చేశాడు బుచ్చిబాబు. ఇందుకోసం ఇండియా వైడ్ గా ఉన్న స్టార్స్ అందరినీ ఈ సినిమాలో తీసుకోనున్నాడట.  హిందీ, తమిళ, మలయాళ నటీనటులతో పాటు కొంతమంది మరాఠీ థియేటర్ అండ్ టీవీ ఆర్టిస్టులు కూడా ఆర్సీ16(RC16) సినిమా కోసం వర్క్ చేయనున్నాడట.

ఇక ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది. ప్రస్తుతం శంకర్(Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్(Game Changer) మూవీ చేస్తున్న రామ్ చరణ్.. ఈ సినిమా కంప్లీట్ అవగానే బుచ్చిబాబు సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఇక RRR ప్రమోషన్స్ లో భాగంగా కూడా చరణ్ ఆర్సీ16 పై ఆశస్తికర కామెంట్స్ చేశాడు. బుచ్చిబాబు చెప్పిన కథ చాలా బాగుందని, ఇది కూడా గ్లోబల్ వైడ్ గా రీచ్ ఆయే సబ్జెక్ట్ అని, కచ్చితంగా ఈ సినిమా కూడా వరల్డ్ వైడ్ గా మంచి విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చాడు.

ఇక ఇప్పుడు మరోసారి చరణ్ చేసిన ఈ కామెంట్స్ ను గుర్తుచేస్తున్నారు నెటిజన్స్. బుచ్చిబాబు ప్లాన్ ఈ రేంజ్ లో ఉంది కాబట్టే.. చరణ్ ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటూ కామెంట్స్ పెడుతన్నారు. మరి ఈ సినిమాతో చరణ్ ఈ రేంజ్ హిట్ అందుకుంటాడో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.