స్పేస్​ మిషన్లకు మస్తు పైసలు

స్పేస్​ మిషన్లకు మస్తు పైసలు
  • డిపార్ట్​మెంట్​ ఆఫ్ స్పేస్​కు రూ.13,700 కోట్లు
  • గగన్​యాన్, ఆదిత్య ఎల్1, మిషన్​ వీనస్​ ప్రాజెక్టులపై ఫోకస్
  • సైన్స్​ అండ్​ టెక్నాలజీకి రూ.14,217 కోట్లు

న్యూఢిల్లీ: మినిస్ట్రీ ఆఫ్​ సైన్స్​ అండ్​ టెక్నాలజీకి ఈసారి బడ్జెట్​లో రూ.14,217.46 కోట్లు అలాట్​ అయ్యాయి. ఈ మొత్తాన్ని డిపార్ట్​మెంట్​ ఆఫ్​ సైన్స్​ అండ్ టెక్నాలజీ, డిపార్ట్​మెంట్​ ఆఫ్​ బయో టెక్నాలజీ, డిపార్ట్​మెంట్​ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్​ రీసెర్చ్ కు కేటాయిస్తారు. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ సైన్స్​ అండ్ టెక్నాలజీకి రూ.6,000 కోట్లు అలాట్​ అయ్యాయి. ఇన్​ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్, డెవలప్​మెంట్​ కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ బయోటెక్నాలజీకి రూ.2,581 కోట్లు, డిపార్ట్​మెంట్​ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్​ రీసెర్చ్ కు రూ.5,636.46 కోట్లు కేటాయించారు. ఇక ఇస్రో చీఫ్​ ఎస్.సోమనాథ్​ చీఫ్​గా ఉన్న డిపార్ట్​మెంట్​ ఆఫ్​ స్పేస్​కు కూడా ఈసారి కేటాయింపులు పెరిగాయి. ఈ శాఖకు బడ్జెట్​లో రూ.13,700 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది రూ.వెయ్యి కోట్లు ఎక్కువ. స్పేస్​ మిషన్లకు ప్రోత్సాహం ఇచ్చేందుకుగానూ ఈ విభాగానికి కేటాయింపులను కేంద్రం ఈసారి భారీగా పెంచింది. మనదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గగన్​యాన్, ఆదిత్య ఎల్1, మిషన్​ వీనస్​ తదితర ప్రాజెక్టుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు.