Budget 2024: బడ్జెట్ సెషన్స్..జనవరి 30న ఆల్ పార్టీ మీటింగ్

Budget 2024: బడ్జెట్ సెషన్స్..జనవరి 30న ఆల్ పార్టీ మీటింగ్

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 న జరగనున్నాయి.  ఈ క్రమంలో  జనవరి 30న ఉదయం 11.30 గంటలకు   అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు సిద్ధమైంది  కేంద్ర ప్రభుత్వం.  అఖిలపక్ష సమావేశాలనికి రావాల్సిందిగా లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల నేతలకు సమాచారం ఇచ్చింది.  ఈ మేరకు పార్టీలకు  పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం పంపింది.

జనవరి 31 నుంచి  ఫిబ్రవరి 9 వరకు జరనున్న ఈ సమావేశాలు ఈ  లోక్‌సభకు చివరి సమావేశాలు. కీలక బిల్లులు అన్నింటికి గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో... ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లులు ఆమోదానికి తీసుకొస్తుంది ప్రభుత్వం. ఈ బిల్లులు అన్ని ఇప్పటికే ఉభయ సభల్లో ప్రవేశ పెట్టినందున... ఆమోదం తెలిపేందుకు చర్చకు తీసుకురానున్నట్లు సమాచారం.  కొత్తగా తీసుకువచ్చిన భద్రతా ఏర్పాట్లను అన్ని పార్టీలకు వివరించనున్నట్లు సమాచారం.