Budget 2024: ఊహించని షాకిచ్చిన కేంద్రం.. ఇల్లు, స్థలాలు అమ్మితే లాభాలపై భారీగా పన్ను..

Budget 2024: ఊహించని షాకిచ్చిన కేంద్రం.. ఇల్లు, స్థలాలు అమ్మితే లాభాలపై భారీగా పన్ను..

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్థిరాస్తి అమ్మకందారులకు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రాపర్టీ సేల్పై ఇన్నాళ్లూ ఉన్న ఇండెక్సేషన్ బెన్ఫిట్స్ను రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. 2 సంవత్సరాలు దాటిన స్థిరాస్తి ఇప్పుడు అమ్మితే లాభాల్లో 12.5 శాతం పన్ను కట్టాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఢమాల్ అన్నాయి. డీఎల్ఎఫ్ స్టాక్ 6 శాతం పడిపోయింది. గోద్రేజ్ ప్రాపర్టీస్ స్టాక్ 5 శాతం, ప్రెస్టేజ్ ఎస్టేట్ 5.3 శాతం, ఫీనిక్స్ మిల్స్ షేర్ 2.1 శాతం క్షీణించడం గమనార్హం.

Also Read :- ఉద్యోగాలు, పొలిటికల్ ప్రయార్టీలపైనే బడ్జెట్

స్థిరాస్తి అమ్మకాలపై ఈ ప్రకటన రాక ముందు లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్పై ఇండెక్సేషన్ బెన్ఫిట్స్తో కూడిన 10 శాతం పన్ను ఉండేది. ఇప్పుడు ఇండెక్సేషన్ బెన్ఫిట్స్ను తొలగించి స్థిరాస్తి అమ్మగా వచ్చిన లాభాలపై 12.5 శాతం పన్ను కట్టాలని కేంద్ర ప్రభుత్వం దిమ్మతిరేగే షాక్ ఇచ్చింది. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించాలని ఆలోచన చేసే వారికి ఇది పెద్ద పిడుగు లాంటి వార్తేనని చెప్పక తప్పదు. కేంద్రం ఇండెక్సేషన్ బెన్ ఫిట్స్ రద్దు చేయక ముందు, చేశాక 50 లక్షల ప్రాపర్టీని ప్రస్తుతం 70 లక్షలకు అమ్మితే పన్ను ఎలా ఉంటుందో ఈ కింద పేర్కొన్న వివరాలను చూస్తే స్పష్టత వస్తుంది.

Under the old taxation rules


Purchase price: ₹50 lakhs
Adjusted purchase price using CII: ₹64,82,000
Sale price (2024-25): ₹70 lakhs
Gain: ₹5,18,000
Tax liability under old LTCG rules: ₹1,03,600

Under the new taxation rules


Purchase price: ₹50 lakhs
Sale price (2024-25): ₹70 lakhs
Gain: ₹20 lakhs
Tax liability under new LTCG rules: ₹2,50,000