బేసిక్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినహాయింపును రూ.3.5 లక్షలకు పెంచండి: ఈవై

బేసిక్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినహాయింపును రూ.3.5 లక్షలకు పెంచండి: ఈవై

న్యూఢిల్లీ: కొత్త ట్యాక్స్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  బేసిక్ మినహాయింపు లిమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచాలని ట్యాక్స్ అండ్ కన్సల్టెన్సీ కంపెనీ ఈవై ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. లేదా  స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌ డిడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచాలని తెలిపింది. 

ఎకానమీ వృద్ధి చెందడానికి, పెట్టుబడులు వచ్చేందుకు ట్యాక్స్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  మార్పులు చేయాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి తీసుకోవాల్సిన సంస్కరణల లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వానికి అందించింది. వీటితో పాటు కార్పొరేట్ ట్యాక్స్ రేట్లను నిలకడగా ఉంచాలని,  టీడీఎస్ ప్రొవిజన్లను రేషనలైజ్ చేయాలని, సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చింది.