కర్ణాటకలో కూలిన భవనం: ఒకరు మృతి, శిథిలాల్లో 100 మంది

కర్ణాటకలో కూలిన భవనం: ఒకరు మృతి, శిథిలాల్లో 100 మంది

కర్ణాటకలోని ధార్వాడ్‌ కమలేశ్వర్‌నగర్‌ లో నిర్మాణం లో ఉన్న బిల్డింగ్ కుప్పకూలింది. శిథిలాల్లో 100 మంది చిక్కుకున్నారని సమాచారం. ఘటనా స్థాలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం ఒకరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు.

నాలుగు అంతస్థులుగా ఉన్న ఆ బిల్డింగ్ లో రెండు అంతస్తుల నిర్మాణం పూర్తవగా. కొందరు కిరాయికి ఉన్నారు. మరో మూడు, నాలుగు ఫ్లోర్లకు ప్రస్తుతం వర్క్ జరుగుతుంది. అయితే నాసిరకం మెటీరియల్ వాడటం వల్లనే బిల్డింగ్ కూలిపోయిందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. మొదటి, రెండవ ఫ్లోర్ లో షాపింగ్ దూఖానాలు 20 వరకు ఉన్నాయి. ప్రమాదం జరిగినపుడు షాప్ లలో 100మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ భవనం కర్నాటక మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు వినయ్ కులకర్ణి చుట్టాలకు చెందినదిగా తెలిసింది.

ప్రమాదం జరిగిన వెంటనే.. కర్నాటక సీఎం కుమార స్వామి స్పంధించారు. సహాయక చర్యలను యుద్ధ ప్రతిపాదికగా చేపట్టాలని ఆదేశించారు.