భవనం కూలిన ఘటనలో కార్మికుడు మృతి

భవనం కూలిన ఘటనలో కార్మికుడు మృతి

హర్యానాలో విషాదం జరిగింది. గురుగ్రామ్‌లోని ఉద్యోగ్ విహార్ ఫేజ్ Iలోని ఒక భవనం కుప్పకూలింది. శిథిలావస్థకు చేరిన మూడు అంతస్థుల బిల్డింగ్ ను కూల్చివేస్తుండగా శిథిలాల కింద నలుగురు కార్మికులు చిక్కుకుపోయారు. సెప్టెంబర్ 26 నుంచి ఈ భవనాన్ని కూల్చివేస్తున్నారు. పై రెండు అంతస్థులను కూల్చివేసిన కూలీలు, మిగిలిన  భాగం  దానంటత అదే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు చనిపోయాడు. శిథిలాల కింద  చిక్కుకున్న ముగ్గురిని వెలికితీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక కార్మికుడిని రక్షించామని అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.