
మధురై జిల్లాలో విషాద సంఘటన జరిగింది. ఉసిలంపట్టి దగ్గర్లోని సొక్కనూరనీలో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం నిన్న సాయంత్రం కుప్పకూలింది. ఈఘటనలో ఒకరు చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే అలర్టయ్యారు పోలీసులు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో శిథిలాల కింద ఉన్న వారిని బయటకు తీశారు. వీరిలో ముగ్గురి పరిస్థితి సీరియస్ గా ఉంది. భవనం కూలిన ప్రదేశంలో శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయి.