ఎద్దుల పందాలను బీఆర్ఎస్ పందాలుగా మార్చిన్రు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎద్దుల పందాలను బీఆర్ఎస్ పందాలుగా మార్చిన్రు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

నల్గొండ జిల్లాలోని మేళ్లచెరువు మహా శివరాత్రి జాతరను రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఎద్దుల పందాలను బీఆర్ఎస్ పందాలుగా మార్చారని ఆరోపించారు. ఎన్నడూ లేని విధంగా గుడి ప్రాంగణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్న ఉత్తమ్.. రంగులరాట్నం నిర్వాహకులను బెదిరించి పోలీసుల మధ్యవర్తిత్వంతో బీఆర్ఎస్ నాయకులు రూ.14 లక్షలు లంచం తీసుకున్నారని విమర్శించారు. ప్రభల వద్ద కూడా బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారం ఉంది కదా అని పోలీసులను అడ్డం పెట్టుకొని బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన టైంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.