బుల్లెట్ మూవీ మార్చి 8న విడుదల

బుల్లెట్ మూవీ మార్చి 8న విడుదల

రవి వర్మ హీరోగా చౌడప్ప దర్శకత్వంలో  బండి సదానంద్ నిర్మించిన చిత్రం ‘బుల్లెట్’. సంజనా సింగ్, ఆలోక్ జైన్, మనీషా దేవ్, జీవ ఇతర పాత్రలు పోషించారు. మార్చి 8న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన  ప్రీ రిలీజ్ ప్రెస్‌‌మీట్‌‌కు నిర్మాత ఎ.ఎం రత్నం, దర్శకులు వి సముద్ర అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. 

అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరో రవి వర్మ థ్యాంక్స్ చెప్పాడు. ‘ఇదొక యాక్షన్ సినిమా. కర్నూల్‌‌లో చిత్రీకరించాం. నటీనటులు, టెక్నీషియన్స్ ఎంతో సపోర్ట్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’ అని దర్శకనిర్మాతలు తెలియజేశారు. కో ప్రొడ్యూసర్ గోపాల్, శ్రీచక్ర ఎండి శ్రీ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.