Tech Layoffs : పాపులర్ డేటింగ్ యాప్ Bumble నుంచి 350 మంది ఉద్యోగులు ఔట్..

Tech Layoffs : పాపులర్ డేటింగ్ యాప్ Bumble నుంచి 350 మంది ఉద్యోగులు ఔట్..

పాపులర్ డేటింగ్ యాప్ Bumble తన ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కంపెనీ షేర్లు భారీగా పడిపోయవడంతో 350 మంది ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. పోస్ట్ ట్రేడింగ్ గంటలలో కంపెనీ విలువ 7 శాతానికి పైగా పడిపోయింది. ఇది స్టాక్ మార్కెట్ లో ప్రకంపనలు సృష్టించింది. చెల్లింపుల వినియోగదారుల సంఖ్య పెరిగినప్పటికీ గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయాలు అంచనాలకు మించి పడిపోవడంతో ఒక్కో షేర్లు నష్ట పోయాయి. 

అయితే ఉద్యోగాల కోతలకు దాదాపు 20 మిలియన్ డాలర్ల నుంచి 25 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని కంపెనీ భావిస్తోంది. ఇందులో ఎక్కువ భాగం 2024 మొదటి భాగంలో జరుగుతుందని కంపెనీ ప్రకటించింది. 

బంబుల్ ప్రతి సంవత్సరం 8 శాతం నుంచి 11 శాతం వరకు పెరుగుతుందని అశించినప్పటికీ  వృద్ధి మందగించడం గురించి ఆందోళన వ్యక్తం చేశారు నిపుణులు, ఈ త్రైమాసికంలో వారి అంచనా ఆదాయం విశ్లేషకులు అనుకున్న దానికంటే తక్కువగా ఉంది. దాదాపు 277.9 మిలియన్ల డాలర్లకు బదులుగా 260 మిలియన్ల డాలర్ల నుంచి 268 మిలియన్ల డాలర్ల వరకు ఉన్నాయి. 

ALSO READ :- బిస్కెట్​ ను తెలుగులో ఏమంటారో తెలుసా...

గత సంవత్సరం బంబుల్ ను ఎక్కువ మంది వినియోగించారు. 3.4 మిలియన్ల నుంచి 4 మిలియన్ల వినియోగదారులు బంబుల్ ను సబ్ స్క్రైబ్ చేశారు. అయితే గత త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. 273.6 మిలియన్ డాలర్లు సంపాదించారు. విశ్లేషకులు అనుకున్న దానిని కోల్పోయారు. లాభానికి బదులు ఒక్కో షేరుకు డబ్బును నష్టపోయారు. దీంతో బంబుల్ కంపెనీ తన ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.