
జూబ్లీహిల్స్, వెలుగు : డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా పోస్టర్లను సోమవారం కొందరు యువకులు జూబ్లీహిల్స్‌లోని ఆయన ఆఫీసు వద్ద దహనం చేశారు. వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలంటూ ఆందోళన చేశారు.
ఆఫీసు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని యువకులను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించారు.