యూపీలో ఘోర ప్రమాదం: కారును ఢీకొట్టి లోయలో పడ్డ బస్సు ఏడుగురు మృతి

యూపీలో ఘోర ప్రమాదం: కారును ఢీకొట్టి లోయలో పడ్డ బస్సు ఏడుగురు మృతి

ఇటావా (యూపీ): ఉత్తరప్రదేశ్ లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు రాంగ్ రూట్ లో ఎదురొచ్చిన కారును ఢీ కొట్టి లోయలో పడిపోయింది. దీంతో ఏడుగురు చనిపోగా మరో 25 మంది గాయపడ్డారు. లక్నో–ఆగ్రా ఎక్స్ ప్రెస్ వే పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్ బరేలీ నుంచి 60 మంది ప్రయాణికులతో బస్సు ఢిల్లీకి బయలు దేరింది.

ఉస్రహార్ ఏరియాలో ఓ కారు రాంగ్ రూట్ లో ఎదురుగా వచ్చింది. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం, రాంగ్ రూట్ లో కారును వేగంగా నడపడంతో బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు రోడ్డు పక్కనున్న 20 అడుగుల లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.