ప్రైవేట్‌ బస్సులో మంటలు..28 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్

ప్రైవేట్‌ బస్సులో మంటలు..28 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్
  • డ్రైవర్ అప్రమత్తతతో బయటపడ్డ 28 మంది ప్రయాణికులు 
  • హైదరాబాద్‌‌‌‌ నుంచి నెల్లూరు వెళ్తుండగా నల్గొండ జిల్లాలో ఘటన

చిట్యాల, వెలుగు: ఇంజన్‌‌‌‌లో మంటలు అంటుకోవడంతో ఓ ప్రైవేట్‌‌‌‌ ట్రావెల్స్‌‌‌‌ బస్సులో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్‌‌‌‌‌‌‌‌ వెంటనే బస్సును రోడ్డుకు పక్కన ఆపి ప్రయాణికులను అలర్ట్‌‌‌‌ చేశారు. దీంతో బస్‌‌‌‌లో ఉన్న 28 మంది ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. విహారి ప్రైవేట్‌‌‌‌ ట్రావెల్స్‌‌‌‌కు చెందిన బస్సు మంగళవారం హైదరాబాద్‌‌‌‌లోని బీరంగూడ నుంచి ఏపీలోని నెల్లూరు జిల్లా కొండాపురానికి వెళ్తుండగా నల్గొండ జిల్లా వెలిమినేడు గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. 

కొద్ది క్షణాల్లోనే మంటలు అంటుకుని బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందడంతో రెండు ఫైర్‌‌‌‌‌‌‌‌ ఇంజన్లతో స్పాట్‌‌‌‌కు చేరుకున్న ఫైర్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే, బస్‌‌‌‌లో మంటలు ఆర్పేందుకు ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేవని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపిస్తున్న ట్రావెల్స్‌‌‌‌ యాజమాన్యాలపై చర్యలు తీస్కోవాలని డిమాండ్ చేశారు. 

కాగా, శనివారం చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారి పై ఇన్నోవా కారు డివైడర్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టడంతో మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలోనూ కారులో ఉన్న ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు.