పెబ్బేరు, వెలుగు: ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరవేయాలనే సంకల్పంతో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి బస్సు యాత్ర చేపట్టారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లాలోకి ప్రవేశించిన బస్సు యాత్రకు పెబ్బేరులో డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డితో కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం సుభాష్ చౌరస్తాలో జరిగిన సభలో మాట్లాడారు. పెబ్బేరులో 30 పడకల ఆసుపత్రి, వనపర్తి–పెబ్బేరు మున్సిపాలిటీల్లో సీసీ రోడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి, పెబ్బేరు మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర పాల్గొన్నారు.
రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం
వనపర్తి, వెలుగు : రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి పట్టణంలోని ఆర్‌జీ గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన బీఎల్‌ఏలకు శిక్షణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలో ఉన్న 316 మంది బీఎల్‌ఏలు ఓటరు జాబితాలను పరిశీలించి డబుల్ ఓట్ల తొలగింపునకు సహకరించాలని అన్నారు కార్యక్రమంలో బీఎల్ఏ - 2 ఇంచార్జ్ శత్రు బుజ్జి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, సాయి చరణ్ రెడ్డి పాల్గొన్నారు.
భువనగిరిలో మండలాధ్యక్షులుగా బీసీలకు చాన్స్
యాదాద్రి: భువనగిరి నియోజకవర్గంలో మండలాలు, పట్టణ అధ్యక్షులుగా ఐదుగురు బీసీలు, ఒకటి ఓసీ, మరొకటి ఎస్సీలకు అవకాశం కల్పించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరిగాయి భువనగిరి మండల అధ్యక్షుడిగా ఎల్లంల జంగయ్య, భూదాన్ పోచంపల్లికి వెంకటేశ్ వలిగొండకు బత్తిని సహదేవ్, భువనగిరి టౌన్‌కు కూర వెంకటేశ్, భూదాన్ పోచంపల్లి టౌన్‌కు భారత లవకుమార్‌ను ఎంపిక చేశారు. బీబీనగర్ మండల అధ్యక్షుడిగా సురక్గొ సత్తిరెడ్డి, వలిగొండ టౌన్ అధ్యక్షుడిగా జానకీ రాములు(ఎస్సీ)ని ఎంపిక చేశారు.
